Share News

Health Benefits: మెంతులతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలంటే.. ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే..!

ABN , Publish Date - May 09 , 2024 | 02:26 PM

మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి.

Health Benefits: మెంతులతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలంటే.. ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే..!
immune system

మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి. మెంతి ఆకు, మెంతి గింజలు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. మెంతి నీరు మధుమేహం ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలోనూ మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. మెంతులను కాసిని చల్లితే మెంతి ఆకు వస్తుంది. దీనిని పప్పులు, పులుసులలో వేసుకోవచ్చు. మెంతులను నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరంలోని అనేక రుగ్మతలకు చెక్ పెడుతుంది. అలాగే మెంతులు నానబెట్టి, నూరి తలకు పట్టించుకుంటే జుట్టు ఆరోగ్యానికి మంచిది.

మెంతి నీటిని తీసుకోవడం వల్ల కలిగే తొమ్మిది ప్రయోజనాలున్నాయి. దీనిని ఉదయాన్నే అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచడం, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ మెంతి నీరు రక్తంలో ఇన్సులిన్ నిరోధకతలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.


ఈ మొక్కను గుర్తు పట్టారా..! ఈ సర్కారు తుమ్మతో ఎన్ని లాభాలంటే..!

మెంతి నీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ గుణాలున్నాయి. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మెంతి నీరు ఫైటో ఈస్ట్రోజెన్ కంటెంట్‌కు పేరు పొందింది. సహజమైన మెరుపును అందిస్తుంది.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య, దురద తగ్గుతాయి.

మెరుగైన రోగనిరోధక వ్యవస్థ.. మెంతి నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.


Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !

శరీరానికి వచ్చే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

మెంతి నీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలలో ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 09 , 2024 | 02:26 PM