PM Narendra Modi: మోదీపై ఆరేళ్లు నిషేధం విధించాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
ABN , Publish Date - May 14 , 2024 | 05:35 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని ఓ పిటిషన్ దాఖలైంది. అయితే.. దీనిని సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం తోసిపుచ్చింది. ఇలాంటి వ్యవహారాలపై ఎన్నికల సంఘాన్ని (Election Commission) సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో.. ఆ పిటిషనర్ తన పిటిషన్‌ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
అంతరిక్షంలో ‘దేవుడి చెయ్యి’.. వైరల్ అవుతున్న ఫోటో
ఫాతిమా (Fatima) అనే మహిళ ఆనంద్ ఎస్ జొంధాలే (Anand S Jondhale) అనే న్యాయవాది ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా.. ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రధాని మోదీపై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. అయితే.. ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, ఎస్‌సీ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది.
భారత్‌కు అమెరికా వార్నింగ్.. ఆ ఒప్పందం కుదిరిన గంటల్లోనే..
‘‘అసలు మీరు ఎన్నికల అధికారుల్ని సంప్రదించారా? మాండమస్ రిట్ కోసం మీరు ముందుగా అధికారుల్ని సంప్రదించాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ తన పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. కాగా.. ఇంతకుముందు కూడా ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్ దాఖలైంది. దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై పిటిషనర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడని, అది ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నప్పుడు కోర్టుని ఆశ్రయించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఏ విధంగా చూసినా ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంది.
Read Latest National News and Telugu News