Share News

Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్

ABN , Publish Date - May 04 , 2024 | 03:57 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సోదరుడు రాహుల్ గాంధీని యువరాజుగా సంబోధిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ప్రధాని మోదీ తన రాజభవనంలో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదన్నారు.

Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్

బనస్‌కాంత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని యువరాజు (Shehzada)గా సంబోధిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ప్రధాని మోదీ తన రాజభవనం (Palace)లో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదని గుజరాత్‌లోని బనస్‌కాంతలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అన్నారు.


''నా సోదరుడిని ఆయన షెహజాదా అని పిలుస్తారు. నా సోదరుడు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మరోవైపు, మన చక్రవర్తి నరేంద్ర మోదీ రాజభవనాల్లో ఉంటారు. నిస్సహాయ రైతులు, మహిళల అవస్థలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతాయి? అధికారం ఆయన చుట్టూ ఉంది. ఆయన చుట్టూ ఉండే వాళ్లు ఆయనను చూసి భయపడిపోతుంటారు. ఎవరూ ఆయనకు ఒక్క మాట కూడా చెప్పలేరు. ఎవరైనా ఒకవేళ తన గొంతు వినిపించాలనకున్నా వారి గొంతు అణగదొక్కేస్తుంటారు'' అని ప్రియాంక చెప్పారు. ప్రధానమంత్రి బడా వ్యక్తుల గురించే పట్టించుకుంటారు కానీ సామాన్య ప్రజానీకం గోడు ఆయనకు అక్కరలేదని ప్రియాంక విమర్శించారు. గుజరాత్ ప్రజలు మోదీని గౌరవించి ఆయనకు అధికారం కట్టబెట్టారని, కానీ ఆయన బడా వ్యక్తుల గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. మోదీ కనీసం ఒక్క రైతునైనా కలుసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? వారిని కలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎన్నికలు ముంచుకొచ్చి. తమకు ఓట్లు రావని తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ చట్టాలను మారుస్తామంటున్నారని ఆక్షేపించారు.

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు టిక్కెట్ తిరిగి ఇచ్చేసిన పూరీ లోక్‌సభ అభ్యర్థి.. కారణం ఏమిటంటే..


రాజ్యాంగాన్ని మార్చే యత్నం

భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని ప్రియాంక ఆరోపించారు. ''ప్రజలకు రాజ్యాంగ హక్కులు ప్రసాదించింది. అన్నింటికంటే పెద్ద హక్కు ఓటు హక్కు. రిజర్వేషన్‌ హక్కుతో పాటు ప్రశ్నించే హక్కు, ఆందోళన చేసే హక్కు దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించింది. అందువల్లే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది కచ్చితంగా ప్రజల హక్కులను ఊడలాక్కోవడమే అవుతుంది'' అని ప్రియాంక విమర్శించారు. ప్రపంచంలోనే విలక్షణ వ్యక్తిత్వం కలిగిన మహాత్మాగాంధీ ఈ గుజరాత్ గడ్డపైనే పుట్టారని, సర్దార్ పటేల్, వీర్ రాంచోడ్ రబ్రి కూడా ఇక్కడే జన్మించారని గుర్తు చేశారు. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం కోసం ఎందరో గొప్ప వ్యక్తులు పోరాటం చేశారని, దేశ విముక్తి తర్వాత రాజ్యాంగాన్ని ప్రసాదించారని, రాజ్యాంగం గొప్పతనాన్ని అందరూ గుర్తించాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 03:57 PM