Amit Shah: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిలు రొటీన్ జడ్జిమెంట్ కాదు..
ABN , Publish Date - May 15 , 2024 | 08:39 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme court) మధ్యంతర బెయిల్ (Interm bail) ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు దేశంలోని చాలా మంది అనుకుంటున్నారని తెలిపారు.
Lok Sabha Elections 2024: పీఓకే మనదే, వెనక్కి తెస్తాం: అమిత్‌షా
''ప్రస్తుతం ఆయన (అరవింద్ కేజ్రీవాల్) మరో అంశంలో (స్వాతి మలివాల్‌పై సీఎం సిబ్బంది దాడి) చిక్కుకున్నారు. దాని నుంచి ఆయన బయటపడిన తర్వాత ఏమి జరుగుతుందనేది చూడాలి'' అని అమిత్‌షా జవాబిచ్చారు. 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మోదీ ఇంకెంతోకాలం ప్రధానిగా ఉండరంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను షా కొట్టివేశారు. 2029 వరకూ ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతారని చెప్పారు. కేజ్రీవాల్‌కు మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉందని, 2029 తర్వాత కూడా పార్టీని మోదీ ముందుండి మరీ నడిపిస్తారని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 24 నుంచి 30 సీట్లు గెలుస్తుందని అమిత్‌షా మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.
Read Latest National News and Telugu News