Share News

Chandrababu: నేడు డోన్, నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:58 AM

కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్‌లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.

Chandrababu: నేడు డోన్,  నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లా (Kurnool Dist.)లో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్‌లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో ప్రజాగళం సభ (Prajagalam Sabha)లో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి అల్లూరులో చంద్రబాబు బసచేస్తారు.


కాగా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం 3.30 గంటలకు పట్టణంలోని వెంకటనాయునిపల్లె రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్‌లో ల్యాండ్‌ అవుతారు. అక్కడి నుంచి వాహనంలో వచ్చి గాంధీ సర్కిల్‌లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.10 గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పటేల్‌ సెంటర్‌కు రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. 7.50 గంటలకు మాండ్ర శివానందరెడ్డి నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.


కాగా మే 13న ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, గ్రావెల్, భూ సంపదను దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ కులానికి, మతానికి మంచి జరగలేదని విమర్శించారు. ‘‘జగన్‌కు డ్రైవింగ్ రాదు. రివర్స్ గేర్‌లో వెళ్లి రాష్ట్రాన్ని యాక్సిడెంట్ చేశాడు. మాటలు చెప్పి బటన్ నొక్కితే ఆదాయం పెరగదు. మంచి ఆలోచన చేసి కష్టపడితే ఆదాయం వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు కష్టపడ్డాను. తలసరి ఆదాయం బాగా పెరిగింది. బటన్ నొక్కి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గూడూరు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు మాట్లాడారు.


మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటారని, చెత్త పాలనలో జనం ఇబ్బందులు పడతారని, జగన్ పాలనలో ఇదే జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ‘‘1996-1997లో వర్గీకరణ చేయడంతో మాదిగలకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు. మళ్లీ మాదిగలకు న్యాయం చేస్తాను. మనం గెలుస్తున్నాం. అనుమానం లేదు. ఇక మనకు తిరుగు లేదు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ- జనసేన- బీజేపీ కలిశాం. గతంలో ఎన్డీయేలో ఉన్నా ముస్లింలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఏ చిన్న ఇబ్బందులు కూడా కలగ లేదు. నాలుగు 4 శాతం ఉద్యోగాలు తీసేస్తారని ముస్లింల ఇళ్ల వద్దకు వెళ్లి జగన్ విషప్రచారం చేస్తున్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం దొంగగా చిత్రీకరించి వేధింపులకు గురి చేశారు. దీంతో అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ టీడీపీ. అబ్దుల్ సలాంను చంపిన పార్టీ వైసీపీ’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 29 , 2024 | 07:02 AM