Share News

AP Elections 2024: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో భూములు దోచుకునే కుట్ర: చంద్రబాబు

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:14 PM

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. మన భూములు మనకు దక్కకుండా సీఎం జగన్ (CM Jagan) చేస్తారని విరుచుకుపడ్డారు.

 AP Elections 2024: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో భూములు దోచుకునే కుట్ర: చంద్రబాబు
Nara Chandrababu Naidu

నంద్యాల: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. మన భూములు మనకు దక్కకుండా సీఎం జగన్ (CM Jagan) చేస్తారని విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. నంద్యాల జిల్లాలోని డోన్‌లో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..


ఈ ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతు కూలీలు దీనావస్థలో ఉన్నారని చెప్పుకొచ్చారు. హార్టికల్చర్‌ను నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మసీదులు కూల్చి వేస్తామని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మసీదులు నిర్మించిన పార్టీ టీడీపీ అని.. ముస్లింలకు సంక్షేమ పథకాలు ఇచ్చామని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మే 13న వారిని పట్టుకోవడానికి సిద్ధమా అని అడిగారు. పిట్ట కథలు, కట్టుకథల మంత్రికి కాలం చెల్లిందని చంద్రబాబు విమర్శించారు.


AP Elections 2024: మా ప్రచారంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆరణి శ్రీనివాసులు

బుగ్గన చేసిన అప్పు ఎవరూ కడతారు..

ఆయనకు రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. హరికథలు చెప్పే మంత్రి వల్ల ఏమైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రి అని అర్థమని ఎద్దేవా చేశారు. బుగ్గన చేసిన అప్పు ఎవరూ కడతారని నిలదీశారు. మే 13 తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్‌లో ఉంటారో, పారిపోతారో తెలియదన్నారు. ఈ ఎన్నికలు విధ్వంసకర పాలనకు, అభివృద్ధికి సవాల్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ధర్మానికి , ఆ ధర్మానికి మధ్య ఈ ఎన్నికల పోరాటమన్నారు. ఇక్కడ ఆర్థిక మంత్రి బుగ్గనకు, అక్కడ జగన్‌కు ఒళ్లంతా అహంకారమేనని ఫైర్ అయ్యారు. వీరికి కొవ్వు తగ్గించాలన్నారు. అహంకారంతో జగన్ విధ్వంసం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. మీ జీవితాలను చీకటి మయం చేసిన దొంగలను వదిలిపెడతారా అని నిలదీశారు. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉండిపోతుందని అనుకున్నారని... కానీ ఐదేళ్ల తర్వాత మీ దగ్గరికి రావాలని వారు మరిచి పోయారని చంద్రబాబు పేర్కొన్నారు.


AP Elections 2024: ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. ట్విస్ట్ ఏమిటంటే..?

జగన్ రంగుల పిచ్చోడు...

ఈ సైకో ముఖ్యమంత్రి(జగన్) పరదాలు కట్టుకొని తిరుతాడని.. ఎన్నికల ముందు మీ ముందుకు వచ్చాడన్నారు.ప్రజలకు ఏమి చేశాడో మీడియా ముఖ్యంగా ఈ సైకో ముఖ్యమంత్రి ఏనాడైనా చెప్పాడా అని ప్రశ్నించారు. డోన్‌లో జన ప్రభంజనాన్ని చూస్తే వైసీపీకి కాలం చెల్లిందని అర్థమవుతోందన్నారు. పరిపాలన అంటే అప్పులు చేయడం, అరికట్టలు చేయడం కాదని బుగ్గన నేర్చుకోవాలని హితవు పలికారు.

ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. జగన్ రంగుల పిచ్చోడని.. రూ.3000 కోట్లను రంగులకు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. బడికి, గుడికి.. చెట్టుకు, పుట్టకు రంగులు వేశారని ధ్వజమెత్తారు. సాక్షి పేపర్‌కు ప్రకటనల కింద రూ.1000 కోట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. సలహాదారులకు రూ. 700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాయలసీమలో ప్రాజెక్టుల కోసం జగన్ ఏమైనా ఖర్చు పెట్టారా అని నిలదీశారు. మీ భూములను జగన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నారని.. ఇది చాలా ప్రమాదకరమైన విషయమన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి భూముల వివరాలు ఉన్నాయని... రేపు రాబోవు రోజుల్లో మీ పేరు మీద ఏమీ ఉండవని చెప్పారు. జగన్‌ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మీ జీవితాలు తారుమారవుతాయని చంద్రబాబు హెచ్చరించారు.


భూములను తారుమారు చేస్తారు..

మీ భూములను కొట్టేయడానికి ఈ సైకో జగన్ ప్రణాళిక తయారు చేసుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రికార్డులు మార్చి దుర్మార్గులు వారి పేరు మీద మార్చుకుంటారని ధ్వజమెత్తారు. జగన్ 5 ఏళ్లలో వ్యవసాయన్ని అస్తవ్యస్తంగా మార్చారని ఫైర్ అయ్యారు. రైతులకు నష్టం చేశారని, రైతు కూలీలు దినావస్థలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో 90 శాతంతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చానని.. రాష్ట్రంలో వ్యవసాయం ఎత్తిపోయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే అన్నదాతలను ఆదుకుంటామని.. ప్రతి రైతుకు 20వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

జే బ్రాండ్స్ రద్దు చేసే బాధ్యత తనదని.. మద్యం ధరలను తగ్గిస్తామని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఏపీ లిక్కర్ స్కాం పెద్దదని ఆరోపించారు. డోన్‌ గంజాయి మయమైందన్నారు. జగన్ బటన్ నొక్కుతానని ఐదేళ్లు నాటాకాలాడారని.. ఆయన బటన్ నొక్కితే కంటిపై పడిందని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. గులకరాయి నాటకం రక్తి కట్టిందన్నారు. జగన్.. బాబాయి(మాజీ మంత్రి వివేకానందారెడ్డి)ని చంపిన హంతకులను ఆయన కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. బుగ్గనకు ఏమి తెలీదంట..నంగనాచిలా నాటకాలు ఆడుతారని ఎద్దేవా చేశారు. తనకు విశ్వాసనీయత లేదని చెబుతున్నారని.. తన విశ్వాసనీయత ఏ మారుమూలకు వెళ్లినా తెలుస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


జగన్‌ది సామాజిక ద్రోహం..

ప్రజావేదిక, రాజధాని విధ్వంసం అంటే ఎవరి పెరు చెబుతారని ప్రశ్నించారు. ఏపీకి 10 ఏళ్లయినా రాజధాని లేదని.. రాజధాని లేకుండా సైకో, దుష్టుడు చేశారని దుయ్యబట్టారు. తనది సామాజిక న్యాయం, జగన్‌ది సామాజిక ద్రోహమని అన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత తనదని మాటిచ్చారు. ధర్మవరం సుబ్బారెడ్డిని ఒప్పించి టికెట్ కోట్లకు ఇచ్చానని చెప్పారు. సుబ్బారెడ్డికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాదిగలకు, మాలలకు సమ న్యాయం చేస్తామన్నారు. రాయలసీమలో బలిజలకు వైసీపీ ఒక్క సీటు అయినా ఇచ్చిందా అని నిలదీశారు. బలిజలకు రెండు సీట్లను కూటమి ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.

CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 06:31 PM