Share News

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి.. సొంత బావమరిదిపై అటాక్..

ABN , Publish Date - May 04 , 2024 | 04:52 PM

Andhra Pradesh: అధికారం మాది.. మమ్మల్ని ఎవడ్రా అడ్డుకునేది అని భావిస్తున్నారో.. తామే తోపులం అని ఫీల్ అవుతున్నారో.. రౌడీయిజం లక్షణాలో గానీ.. ఎన్నికలు దగ్గరపడుకున్నా కొద్ది అధికార వైసీపీ(YSRCP) నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబపడుతున్నారు. తాజాగా అనకాపల్లి(Anakapalle) వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) రెచ్చిపోయాడు. తన సొంత బావమరిది అని కూడా ..

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి.. సొంత బావమరిదిపై అటాక్..
Budi Mutyala Naidu

Andhra Pradesh: అధికారం మాది.. మమ్మల్ని ఎవడ్రా అడ్డుకునేది అని భావిస్తున్నారో.. తామే తోపులం అని ఫీల్ అవుతున్నారో.. రౌడీయిజం లక్షణాలో గానీ.. ఎన్నికలు దగ్గరపడుకున్నా కొద్ది అధికార వైసీపీ(YSRCP) నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబపడుతున్నారు. తాజాగా అనకాపల్లి(Anakapalle) వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) రెచ్చిపోయారు. తన సొంత బావమరిది అని కూడా చూడకుండా.. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత అని భౌతిక దాడులకు పాల్పడ్డారు. తన అనుచరుతో కలిసి ముత్యాలనాయుడు రెచ్చిపోయారు.


శనివారం నాడు బీజేపీ శ్రేణులు.. అనకాపల్లి పరిధిలోని పలు గ్రామాల్లో అగ్రికల్చర్ డ్రోన్స్‌ ఉపయోగించి బీజేపీ జెండాను ఎగురవేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువ గ్రామంలో కూడా బీజేపీ శ్రేణులు డ్రోన్ ఎగరవేశారు. అయితే, బీజేపీ శ్రేణులపై ముత్యాలనాయుడు, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న బీజేపీ నేత, ముత్యాల నాయుడి మొదటి భార్య తమ్ముడి.. నేరుగా ముత్యాలనాయుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు.


తననే ప్రశ్నిస్తావా అంటూ రెచ్చిపోయిన ముత్యాలనాయుడు.. తన బావమరిది అని కూడా చూడకుండా అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. ఆయన వెంటపడి ఇంట్లోకి చొరబడి, తలుపులు బద్దలుకొట్టి కిరాతకంగా దాడి చేశారు. దీంతో బాధిత నేత పోలీస్ స్టేషన్‌లో ముత్యాలనాయుడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ముత్యాలనాయుడు కొత్త డ్రామాకు తెరలేపారు. డ్రోన్స్ సహాయంతో తనపై నిఘాపెట్టి, హత్యాయత్నానికి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు ముత్యాలనాయుడు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 04 , 2024 | 05:55 PM