Share News

AP Election 2024: జగన్ సర్కారు అలా చేయొద్దు.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:10 PM

జగన్ సర్కారు(Jagan Govt)కు ఎన్నికల కమిషన్ (Election Commission) మరో షాక్ ఇచ్చింది. స్వయం సహయక బృందాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించకూడదని సంబంధిత అధికారులకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. సిద్ధం సభలకు స్వయం సహాయక గ్రూపు సభ్యుల ద్వారా జనసమీకరణ చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి.

 AP Election 2024: జగన్ సర్కారు అలా చేయొద్దు.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

అమరావతి: జగన్ సర్కారు(Jagan Govt)కు ఎన్నికల కమిషన్ (Election Commission) మరో షాక్ ఇచ్చింది. స్వయం సహయక బృందాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించకూడదని సంబంధిత అధికారులకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. సిద్ధం సభలకు స్వయం సహాయక గ్రూపు సభ్యుల ద్వారా జనసమీకరణ చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల కోడ్ రాకముందు వరకూ జగన్ సభలకు జనసమీకరణను అధికారుల వత్తడితో డ్వాక్రాసంఘాలు, వలంటీర్లు తీసుకొచ్చాయి. దీంతో పీఆర్&ఆర్డీ, ఎమ్ఏ&యూడీ శాఖల అధికారులను సీఈఓ మీనా ఆదేశించారు.


AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సూచించారు. ఇక మీదట అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించకూడదని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వ ర్యంలో పనిచేసే అధికారులను ఆదేశించారు.


CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమష్టిగా, రాజకీయ కోణంలో ప్రభావితం చేయొద్దని మందలించారు. సమీకరణ, అవగాహన, సర్వే , ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించారు. ఈ నిబంధనల అమలు విషయంలో సెర్ప్ సీఈఓ, మెప్మా (MEPMA) మిషన్ డైరెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశించారు.


YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 04:06 PM