Share News

Bizarre: 30 ఏళ్ల క్రితం చనిపోయిన వధువు కోసం వరుడు కావలెను..!

ABN , Publish Date - May 15 , 2024 | 08:09 PM

Viral News: సాధారణంగా రోజూ వార్తా పత్రికల్లో(Daily News Papers) వార్తలతోపాటు, వివిధ రకాల ప్రకటనలు(Advertisements) కూడా వస్తాయి. వీటితో పాటు.. వివాహానికి(Matrimonial Advertisement) సంబంధించి వరుడు(Groom) కావలెను, వధువు(Bride) కావలెను..

Bizarre: 30 ఏళ్ల క్రితం చనిపోయిన వధువు కోసం వరుడు కావలెను..!
Matrimonial Advertisement

Viral News: సాధారణంగా రోజూ వార్తా పత్రికల్లో(Daily News Papers) వార్తలతోపాటు, వివిధ రకాల ప్రకటనలు(Advertisements) కూడా వస్తాయి. వీటితో పాటు.. వివాహానికి(Matrimonial Advertisement) సంబంధించి వరుడు(Groom) కావలెను, వధువు(Bride) కావలెను అనే ప్రకటనలు కూడా వస్తాయి. అయితే, తాజాగా ఓ పత్రికలో వచ్చిన వివాహ ప్రకటన.. జనాలను భయపెట్టేలా ఉంది. ఈ ప్రకటనను చూసిన జనాలు ఇదెక్కడి విచిత్రం సామీ అంటూ భయంతో ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎంటా ప్రకటన? ఎవరా ప్రకటన చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకటన? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


30 ఏళ్ల క్రితం చనిపోయిన మహిళకు పెళ్లి కోసం వరుడు కావాలంటూ వార్తాపత్రికలో ప్రకటన చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ ప్రకటనే ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా మారింది. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో చోటు చేసుకుంది. మరి చనిపోయిన వ్యక్తి కోసం పెళ్లి ప్రకటన ఎందుకు చేశారు? అసలు పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అనే సందేహం తప్పకుండా వస్తుంది. ఇందుకు కారణం తెలిస్తే మరింత షాక్ అవుతారు.


పుత్తూరులో ఒక కుటుంబం.. తమ చనిపోయిన కూతురుకి పెళ్లి కోసం ప్రకటన ఇచ్చారు. వాస్తవానికి ఈ దంపతులకు పుట్టిన మహిళ.. శిశువు దశలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువు వయసు లెక్కిస్తే ఇప్పటికి 30 ఏళ్లు ఉంటుంది. అయితే, ఆ శిశువు చనిపోయినప్పటి నుంచి వీరి ఇంట్లో నిరంతరం కష్టాలు ఎదురవుతున్నాయట. ఎప్పుడు ఇబ్బందులే ఎదురవుతున్నాయట. ఏం చేయాలో అర్థంకాక.. కొందరు పెద్దలు, మంత్రగాళ్లను కలిసి అభిప్రాయం తీసుకున్నారట. దీనికి వారు ఇచ్చిన సలహా ఏంటంటే.. చనిపోయిన శిశువు వయసు ఇప్పుడు 30 ఏళ్లు ఉంటుంది. వివాహం కాకుండానే చనిపోవడంతో ఆమె ఆత్మ శాంతించలేదని.. ఆ కారణంగానే ఇంట్లో ఇలా అనర్ధాలు జరుగుతున్నాయని చెప్పారట. ఇందుకు పరిష్కారంగా ఆమెకు పెళ్లి చేయాలని సూచించారట. దీనిని గుడ్డిగా నమ్మిన ఆ కుటుంబం.. వరుడి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే చనిపోయిన తమ కూతురు పెళ్లి కోసం వరుడు కావలెను అంటూ ప్రకటన ఇచ్చారు.


ఇక్కడ మరో ట్విస్ట్..

30 ఏళ్ల క్రితం చనిపోయిన వధువు కోసం.. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వరుడు కావలెను అని ఆ ప్రకటన ఇవ్వడం మరో ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. చనిపోయిన మహిళకు బ్రతికి ఉన్న పురుషుడితో పెళ్లి చేయడం అసాధ్యం. అందుకే.. చనిపోయిన పురుషుడు కావలెను అని ప్రకటన ఇచ్చారు. ‘‘30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు కోసం.. 30 క్రితం చనిపోయిన వరుడు కావలెను. ఆత్మలకు వివాహం చేయుట కొరకు ఈ నెంబర్‌కు ***** కాల్ చేయండి’’ అంటూ పేపర్‌లో భారీ ప్రకటన ఇచ్చారు.


ఫలించని ప్రయత్నాలు..

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అదే వయస్సు, అదే కులంలో చనిపోయిన వరుడు దొకరడంలేదట. దీంతో పెళ్లి చేయడానికి వీలు పడటం లేదని సదరు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారట.


ఇక్కడే ఇలాంటి ఆచారం..

ఈ ఆచారం.. కర్నాకటలో అనాదికాలంగా వస్తుందట. తుళునాడుగా పిలవడమే ఈ ప్రాంతంలో.. సుధీర్ఘకాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందట. తమిళనాడుతో ఎక్కువ సరిహద్దు, కేరళతో తక్కువ సరిహద్దును పంచుకుని కర్నాటకలోని ఈ ప్రాంతం ఉంటుంది. అందుకే దీనిని తుళునాడుగా పిలుస్తుంటారు. అయితే, ఇక్కడ మరణించిన వ్యక్తులకు వివాహాలు ఏర్పాటు చేస్తారట జనాలు. తుళువ పెద్దల అభిప్రాయం ప్రకారం.. చనిపోయిన వారు వారి కుటుంబాలతో సన్నిహితంగా ఉంటారు. వారి సంతోషాలు, దుఃఖాలలో పాలుపంచుకుంటారు. ఈ కారణంగా.. వారి ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు ఆత్మలకు వివాహం చేస్తారు.

For More Trending News and Telugu News..

Updated Date - May 15 , 2024 | 08:09 PM