Share News

Scam Alert: మెసేజుల పేరుతో మరో కొత్త స్కాం.. తెలుసా మీకు

ABN , Publish Date - May 04 , 2024 | 01:07 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Scam Alert: మెసేజుల పేరుతో మరో కొత్త స్కాం.. తెలుసా మీకు
another scam alert

ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో సెలబ్రిటీల పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు సృష్టించి పలువురి వద్ద నుంచి మనీ దోచుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల పేరుతో కూడా పలువురికి మేసేజ్ చేసి డబ్బులు అడిగిన సంఘటనలు కూడా బయటకొచ్చాయి.

ఇలా స్కామర్లు(scammers) రోజురోజుకు కొత్త పంథాలో దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


ఆఫీస్ పనుల్లో బీజీగా ఉన్న క్రమంలో ఓ వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని అదితి చోప్రా(Aditi Chopra) తెలిపారు. ఆ క్రమంలో ఓ వృద్ధుని మాదిరిగా ఉన్న వాయిస్ ద్వారా ఓ వ్యక్తి మాట్లాడారని, మీ తండ్రికి డబ్బు(money) పంపాల్సి ఉందని తెలిపాడని చెప్పింది. మీ నాన్న అందుబాటులో లేడని, అందుకే మీకు పంపిస్తానని చెప్పానని వెల్లడించారు. ఆ క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న నంబర్ ఇదేనా అని అడిగి ఆ తర్వాత ఓ సారి 10 వేలు, ఆ తర్వాతా 30 వేలు పంపినట్లుగా ఆ మహిళకు మెసేజులు పంపించాడు.


ఆ క్రమంలోనే ఆ వ్యక్తి రూ. 3 వేలకు బదులుగా రూ. 30 వేలు తప్పుగా పంపినట్లుగా చెప్పాడు. పొరపాటను ఆ మొత్తం పంపానని, మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాదు తాను డాక్టర్ వద్ద ఉన్నానని, త్వరగా తనకు డబ్బులు ఇవ్వాలని అడిగి ఓ లింక్‌కు‌ వాటిని పంపించాలని కోరాడు.

ఆ క్రమంలో అప్రమత్తమైన యువతి ఆ మెసేజ్ వచ్చిన బ్యాంక్ ఖాతా గురించి తనిఖీ చేసి తర్వాత ఆ నంబర్‌కు కాల్ చేస్తే ఆమె నంబర్ బ్లాక్ చేయబడింది.‌ దీంతో ఆ కాల్ స్కాం(scam call) అని ఆమె నిర్ధారించుకుంది. డబ్బు విషయం ఏదైనా ఉంటే మా నాన్న ప్రతిదీ వివరిస్తాడని తెలిపింది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ బ్యాంకు ఖాతాలు(bank accounts) తనిఖీ చేసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.


ఇక భారతదేశంలో ఆన్‌లైన్ మోసాల గురించి మీకు ఏదైనా తెలిసినా లేదా మీకు జరిగినా వెంటనే 155260 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కేంద్రం తెలిపింది. దీంతోపాటు తెలియని వ్యక్తుల వద్ద నుంచి వచ్చే మెసేజులు, లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేయోద్దని అన్నారు.


ఇది కూడా చదవండి:

Gold Seized: ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల గోల్డ్ స్వాధీనం


Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు



Read Latest Crime News and Telugu News

Updated Date - May 04 , 2024 | 01:46 PM