Share News

AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:32 PM

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సమస్యలపై నిలదీసిన ప్రజలపై ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల దాడి తీవ్ర కలకలం రేపింది. గుడ్లవల్లేరు మండలం కూరాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ‘‘త్రాగునీరు రావడం లేదు.. రోడ్లు లేవు... లైట్లు లేవు’’ అంటూ కొడాలి నానిని గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే వారిపై దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి దిగారు. విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... కూరాడ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.

AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
TDP Leader Venigandla Ramu

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 2: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) సమస్యలపై నిలదీసిన ప్రజలపై ఎమ్మెల్యే కొడాలి నాని (YSRCP MLA Kodali Nani) అనుచరుల దాడి తీవ్ర కలకలం రేపింది. గుడ్లవల్లేరు మండలం కూరాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ‘‘త్రాగునీరు రావడం లేదు.. రోడ్లు లేవు... లైట్లు లేవు’’ అంటూ కొడాలి నానిని గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే వారిపై దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి దిగారు. విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu)... కూరాడ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. కొడాలి నాని అనుచరుల దాడిలో గాయపడిన శాయన శ్రీకాంత్, విరంకి బాలకృష్ణ, రాజులపాటి కన్నాను ఆయన పరామర్శించారు.

AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం


ఐదేళ్లలో కనిపించకపోవడంతో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామ, గ్రామాన ప్రజలు తమ సమస్యలపై ప్రశ్నలు కురిపిస్తున్నారని రాము అన్నారు. గ్రామ సమస్యలను అడిగిన యువతపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఓట్లు అడగటానికి గుండాలను వెంట వేసుకొచ్చి, ప్రశ్నించిన ప్రజలపై దాడులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి... పిచ్చి డ్రామాలు వేస్తే సహించేది లేదన్నారు. తమ సమస్యలను అడగటం ప్రజల హక్కు అని తెలిపారు. ‘‘దిగిపోయే ముందు అయినా నీ అరాచకాలు అపు... లేదంటే చరిత్ర హినుడుగా మిగిలిపోతావు’’ అంటూ వెనిగండ్ల రాము వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:00 PM