Share News

Viral Video: వామ్మో..! ఈ కింగ్ కోబ్రా ఎంత పని చేసిందీ.. దాని నోటి నుంచి ఏం బయటికి వచ్చిందో చూస్తే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:56 PM

సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కింగ్ కోబ్రా ఏదో లావుగా ఉన్న జీవిని మింగి ఇబ్బంది పడుతుండడాన్ని ప్రజలు గమనించారు. దీంతో చివరకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్..

Viral Video: వామ్మో..! ఈ కింగ్ కోబ్రా ఎంత పని చేసిందీ.. దాని నోటి నుంచి ఏం బయటికి వచ్చిందో చూస్తే..

పాములు సాధారణంగా బల్లులు, చిన్న చిన్న పాములు, పక్షులు, గుడ్లు, కీటకాలు తదితరాలను తింటాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇవి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మాంసాహానికి బదులుగా వింత వింత వస్తువులను తినే పాములను చూశాం. ఇనుప వస్తువులను మింగిన పాములను కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కోబ్రా మింగిన జీవిని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కింగ్ కోబ్రా (King Cobra) ఏదో లావుగా ఉన్న జీవిని మింగి ఇబ్బంది పడుతుండడాన్ని ప్రజలు గమనించారు. దీంతో చివరకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ (Snake Catcher) చివరకు పామును పరిశీలించి, కక్కిన జీవిని బయటికి కక్కించే ప్రయత్నం చేశాడు. అప్పటికే కడుపులో ఉన్న జీవితో ఇబ్బంది పడుతున్న కోబ్రా.. దాన్ని బయటికి కక్కే ప్రయత్నం చేసింది. దాని నోటి నుంచి ముందుగా తోక బయటికి రావడంతో అంతా చిన్న పామును ఏమైనా మింగిందేమో అని అనుకున్నారు.

Viral Video: అయ్యో.. ఎంత ఘోరం..! శ్మశానవాటిక పక్కనే కూర్చుని ఉండగా.. ఉన్నట్టుండి..

అయితే తర్వాత చాలా సేపు శ్రమించిన కోబ్రా.. తన కడుపులోని మొత్తం జీవిని బయటికి కక్కేసింది. తీరా మానిటర్ బల్లి (Monitor Lizard) బయటపడడంతో అంతా నోరెళ్లబెట్టారు. లావుగా ఉన్న మానిటర్ బల్లిని ఈ పాము ఎలా మింగిదంటూ అంతా చర్చించుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ కోబ్రా ఏంటీ ఇలా చేసిందీ’’.. అంటూ కొందరు, ‘‘ఇంత లావుగా ఉన్న మానిటర్ బల్లిని ఎలా మింగిందో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలా ఉండడం ఎంతమందికి సాధ్యం.. కష్టంలోనూ ఆనందం వెతుక్కోవడం అంటే ఇదే..

Updated Date - Apr 25 , 2024 | 02:56 PM