Share News

Viral Video: వామ్మో..! నీళ్లలోని మొసలికి ఇంత పవరా.. డ్రోన్ కెమెరా పంపడంతో చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 01 , 2024 | 09:45 PM

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువైనా నీళ్లలోని మొసలికి చిక్కితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏనుగు వంటి పెద్ద జంతువు కూడా మొసలిని చూసి భయపడుతుంటుంది. మొసలి దాడికి సంబంధించిన...

Viral Video: వామ్మో..! నీళ్లలోని మొసలికి ఇంత పవరా.. డ్రోన్ కెమెరా పంపడంతో చివరకు ఏం జరిగిందంటే..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువైనా నీళ్లలోని మొసలికి చిక్కితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏనుగు వంటి పెద్ద జంతువు కూడా మొసలిని చూసి భయపడుతుంటుంది. మొసలి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీళ్లలోని మొసలి పవర్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ డ్రోన్ కెమెరాలను సమీపానికి పంపించారు. చివరికి ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీళ్లలో ఉన్న మొసలికి (crocodile) పవర్ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నీళ్లలోని మొసలి పవర్‌ను తెలుసుకునేందుకు కొందరు ప్రయోగం చేశారు. ఆహారం కోసం నీళ్లలో దాగి వేచి చూస్తున్న మొసలి వద్దకు డ్రోన్ కెమెరాను (Drone camera) పంపించారు. నీళ్లలో మునిగి తల కొంచెం బయటికి పెట్టిన మొసలి.. ఆహారం కోసం వేచి చూస్తోంది. అంతలో దాని పైకి డ్రోన్ కెమెరా వచ్చింది.

Viral Video: దుస్తుల దుకాణంలోకి దూరిన ఎద్దులు.. చివరికి ఏం జరిగిందో చూడండి..


డ్రోన్‌ను చూడగానే.. ‘‘ఆహా.. ఏదో వింత పక్షి వచ్చిందీ.. ఈ పూటకు దీన్ని కానిద్దాం’’.. అని అనుకుందో ఏమో గానీ.. చాలా సేపు దాన్ని గమనించిన మొసలి ఒక్కసారిగా నీటిలో నుంచి పైకి లేచి నోటితో పట్టేసుకుంది. డ్రోన్ కెమెరాను నోట్లో వేసుకున్న మొసలి.. అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓహో..! ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అదేదో.. వింత జీవి అనుకున్నట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడి ఎదురుగా వెళ్లి షాక్ ఇచ్చిన ప్రియురాలు.. చివరికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందంటే..

Updated Date - May 01 , 2024 | 09:45 PM