Share News

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే...

ABN , Publish Date - May 01 , 2024 | 04:59 PM

కొందరికి ఎవరికీ రాని వింత వింత ఐడియాలు వస్తుంటాయి. కొందరు కారు మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్నానం చేస్తుంటారు. మరికొందరు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏకంగా తమ పెంకుటిళ్లపై వాటర్ స్ప్రింకర్లను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి..

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే...

కొందరికి ఎవరికీ రాని వింత వింత ఐడియాలు వస్తుంటాయి. కొందరు కారు మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్నానం చేస్తుంటారు. మరికొందరు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏకంగా తమ పెంకుటిళ్లపై వాటర్ స్ప్రింకర్లను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న టెక్నిక్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాత కూలర్‌ని ఏసీగా మార్చిన వ్యక్తిని చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఇందుకోసం అతను తన ఇంట్లోని పాత కూలర్‌ని తీసుకొచ్చాడు. ఫ్యా్న్ మాత్రమే పని చేస్తున్న ఆ కూలర్‌ను.. ఫ్రిడ్జ్ డోరు తెరచి దాని ముందు ఏర్పాటు చేశాడు. ఫ్రిడ్జ్ (fridge) నుంచి బయటకు వచ్చే చల్లటి గాలిని కూలర్‌లోని (Cooler) ఫ్యాన్ లాక్కుని.. బయటికి పంపిస్తోందన్నమాట.

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తుండగా మధ్యలో షాకింగ్ ట్విస్ట్.. అతడి ఫోన్‪‌లో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే..


ఇలా ఎంచక్కా తన ఇంటిని మొత్తం చల్లగా మార్చేశాడు. ఫ్రిడ్జి ఎదురుగా కూలర్‌ని ఏర్పాటు చేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జి పాడవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..

Updated Date - May 01 , 2024 | 04:59 PM