Share News

Viral Video: ప్రియుడి ఎదురుగా వెళ్లి షాక్ ఇచ్చిన ప్రియురాలు.. చివరికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందంటే..

ABN , Publish Date - May 01 , 2024 | 08:29 PM

ప్రేమికుల మధ్య చోటు చేసుకునే ఘటనలు.. చివరకు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలు షాక్ అయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని ...

Viral Video: ప్రియుడి ఎదురుగా వెళ్లి షాక్ ఇచ్చిన ప్రియురాలు.. చివరికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికుల మధ్య చోటు చేసుకునే ఘటనలు.. చివరకు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలు షాక్ అయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రియుడి ఎదురుగా వెళ్లిన ప్రియురాలు అతడికి పెద్ద షాకే ఇచ్చింది. అయితే చివరకు బిగ్ సర్‌ప్రైజ్ చేసి ఖషీ చేసింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్లేస్టేషన్- 4లో (ps4) గేమ్స్ ఆడుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అతడి ప్రియురాలు.. ప్లేస్టేషన్- 4 చేతిలోకి తీసుకుని బలంతంగా నేలకేసి కొడుతుంది. తర్వాత దాన్ని కాలితో తన్ని ముక్కలు చేస్తుంది. తన ప్రియురాలు ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడం చూసి ఆమె ప్రియుడితో పాటూ అతడి స్నేహితులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్లేస్టేషన్- 4ను పగులగొట్టిన యువతి (woman smashed the Playstation-4).. అక్కడి నుంచి పక్కకు వెళ్లి.. కాసేపటి తర్వాత కొత్త ప్లేస్టేషన్- 5ని తీసుకుని వస్తుంది.

Viral Video: దుస్తుల దుకాణంలోకి దూరిన ఎద్దులు.. చివరికి ఏం జరిగిందో చూడండి..


ప్రియురాలు తీసుకొచ్చిన ప్లేస్టేషన్- 5 (ps5) బాక్స్‌ని చూడగానే అమె ప్రియుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ప్రియురాలిని కౌగిలించుకుని థ్యాంక్స్ చెబుతాడు. ఇద్దరూ ప్లేస్టేషన్- 5ని చేత్తో పట్టుకుని సంతోషంతో డాన్సులు చేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ప్లేస్టేషన్- 4ను అనవసరంగా పగులగొట్టిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 01 , 2024 | 08:29 PM