Share News

AP Elections 2024: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తాం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - May 01 , 2024 | 09:22 PM

ఎన్డీఏ అధికారంలోకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదని.. వైఎస్ జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎద్దేవా చేశారు. మనకు జీరాక్స్ కాగితాలు ఇస్తారట.. మన ఆస్తి మీద మనకు హక్కు లేకుండా చేయడం మనల్ని దోచుకోవడం కాదా అని ప్రశ్నించారు.

 AP Elections 2024: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తాం: పవన్ కల్యాణ్
Pawan Kalyan

ఉమ్మడి విశాఖ జిల్లా: ఎన్డీఏ అధికారంలోకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదని.. వైఎస్ జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎద్దేవా చేశారు. మనకు జీరాక్స్ కాగితాలు ఇస్తారట.. మన ఆస్తి మీద మనకు హక్కు లేకుండా చేయడం మనల్ని దోచుకోవడం కాదా అని ప్రశ్నించారు.

పెందుర్తిలో కూటమి ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్లాసును పగలగొడితే మరింత పదునెక్కుతుందని అన్నారు. ఒక్క ఛాన్స్ అని గత ఎన్నికల్లో జగన్ అడిగారని.. ఇక చాలు..భవిష్యత్తు బాగుపడేందుకు ఇక రెండు వారాలే ఉందన్నారు.


Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

ఉత్తరాంధ్ర భూములన్నీ వై.వీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి మొత్తం దోచుకున్నారని ఆరోపించారు. తాడి గ్రామాన్ని తరలించడానికి భూములు లేవా? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడి గ్రామస్తులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చారు. మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెట్లుగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజలు రోడ్లపైకి వచ్చి వైసీపీ నేతల చొక్కాలు పట్టుకోకపోతే ప్రయోజనం లేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని.. అలాంటప్పుడు వైసీపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అక్రమాలు చేసే జగన్ ప్రభుత్వాన్ని కూలదోద్దామని.. ఎన్డీఏ కూటమిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నిరుద్యోగులకు రూ.5 వేల జీతం గల వలంటీర్ల ఉద్యోగాలిస్తే సరిపోతుందా అని నిలదీశారు. ఏపీలో 23 లక్షల మంది యువత గంజాయికి అలవాటు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.


Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

25 వేల కిలోల డ్రగ్స్ విశాఖపోర్టులో పట్టుబడిందని చెప్పుకొచ్చారు.‌ పాకిస్తాన్ జలాంతర్గామి ఘాజీని ముంచినట్టు వైసీపీని సముద్రంలో ముంచాలని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు. ఈ ఎన్నికల్లో త్రిమూర్తుల్లా మూడు పార్టీల నేతలు కలిసి ముందుకెళ్తున్నామని... మీ భవిష్యత్తు కోసమే తమ తాపత్రాయమని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను డౌన్‌లోడ్ చేసుకోండి.. అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని ఉద్ఘాటించారు.

ఓటు అడిగి వెళ్లిపోవట్లేదని... మీ పట్ల బాధ్యతను వదులుకోనని మాటిచ్చారు. గతంలో తాను ఓడిపోయినా కుంగిపోలేదని తెలిపారు.కూటమి అభ్యర్థుల తరపున ఓటు అడుగు తానని.. గెలిచాక వారి చేత పని చేయిస్తామని అన్నారు. కులగణాంకాలు కావని.. ప్రతిభ గణాంకాలు కావాలని సూచించారు. ఆణిముత్యాలను వెలికితీసే బాధ్యత కూటమి తీసుకుంటుందని వివరించారు.భారత్‌ను అగ్రపథంలో నిలపాలంటే జగన్, వైవీ సుబ్బారెడ్డి దగ్గరో డబ్బులుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.


పెందుర్తి వైసీపీఎమ్మెల్యే ఆదీప్ రాజ్‌ చాలా అక్రమాలు చేశారని మండిపడ్డారు. ఆయన పెందుర్తిని మొత్తం దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదీప్ రాజు పెద్ద కరప్షన్ కింగ్ అని విమర్శించారు. ఓట్ల కోసం ఆదీప్ రాజ్, వైసీపీ నేతలు వస్తే వారి అవినీతిపై ప్రశ్నించాలని అన్నారు.

వైసీపీ నేతలను తుంగలో తొక్కి అధికారాన్ని సంపాదించాలన్నారు. ఇల్లు, స్థలం కొనాలన్నా అదీప్ రాజ్‌కు డబ్బులివ్వాలట‌ అని ఆరోపించారు. ప్రభుత్వానికి పన్నులు కడుతున్నప్పుడు.. ఆయనకి డబ్బులు ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. కూటమి అధికారంలోకి రాగానే పంచ గ్రామాల సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 09:37 PM