Share News

Viral Video: కాంగ్రెస్ కార్యకర్త చెంప పగలగొట్టిన డిప్యూటీ సీఎం.. మండిపడుతున్న బీజేపీ

ABN , Publish Date - May 06 , 2024 | 07:44 AM

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..

Viral Video: కాంగ్రెస్ కార్యకర్త చెంప పగలగొట్టిన డిప్యూటీ సీఎం.. మండిపడుతున్న బీజేపీ

హవేరి: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది. కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ బీజేపీ విమర్శలు గుప్పించింది.

ఏమైందంటే.. సవనూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి వినోదా అసూటి ప్రచారంలో(Lok Sabha Polls 2024) పాల్గొనడానికి శివకుమార్ వచ్చారు. ఆయన కారు దిగాక.. ఓ కార్యకర్త శివకుమార్ భుజం మీద చేయి వేసి ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. దీంతో కోప్రోద్రిక్తుడైన డిప్యూటీ సీఎం ఆయన చెంపపై లాగి కొట్టారు. అనంతరం పోలీసులు కార్యకర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించినట్లు తెలుస్తోంది.


కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇదేనా: బీజేపీ

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ డిప్యూటీ సీఎం వైఖరిపై బీజేపీ మండిపడింది. కార్యకర్తల కష్టంపైన అధికారంలోకి వచ్చామంటూ చెప్పుకుంటూ వారిని అవమానించడం ఏంటని ప్రశ్నించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా డీకే వైఖరిని ఖండించారు. గతంలోనూ డీకే ఇతరులపై ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆరోపించారు. అలాంటి నాయకుల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పని చేయాలనుకుంటున్నారోనని ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం కేవలం నేతలకేనా, కార్యకర్తలకు ఉండదా అని ప్రశ్నించారు.


బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. "ఈ మధ్యే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ వృద్ధురాలి చెంప పగలగొట్టారు. తాజాగా డీకే.. కార్యకర్తపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్ వైఖరి దొరల పాలనలా ఉంది. కాంగ్రెస్ కీ పెహచాన్ - జనతా ఔర్ వర్కర్ కా ఆప్మాన్. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే ఆ తర్వాత ఏం చేస్తారో ఊహించుకోండి! ఓటర్లను బెదిరించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కొట్టడం ఇదే వారి పని. కాంగ్రెస్‌పై ఎన్నికల కమిషన్(EC) చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 10:21 AM