Share News

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

ABN , Publish Date - May 06 , 2024 | 09:20 AM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్‌(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు
Jharkhand Huge amount recovered household of Sanjiv Lal PS

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్‌(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED raids) దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో అవి చూసిన అధికారులు సైతం షాక్ తిన్నారు. ఆ మొత్తం నగదు దాదాపు రూ. 20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.


ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున ఉన్న నోట్లను ఇంట్లో ఎలా ఉంచారో చూడొచ్చు. వాటిలో బ్యాగులు, సూట్‌కేసులు, పాలిథిన్‌లలో చుట్టిన నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం అతన్ని ఈడీ అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


PMLA కింద దాదాపు అర డజను ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. సస్పెండ్ చేయబడిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతని సన్నిహితుల స్థావరాలపై కూడా ED చర్యలు తీసుకుంటోంది. కొన్ని పథకాల అమలులో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఫిబ్రవరి 2023లో ED అరెస్టు చేసింది. ఆ క్రమంలో 2023 ఫిబ్రవరి 21న రాంచీ, జంషెడ్‌పూర్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 10:34 AM