Share News

Gold and Silver Rates: అక్షయ తృతీయ ముందే మంచి ఉపశమనం..తగ్గిన గోల్డ్ ధరలు

ABN , Publish Date - May 06 , 2024 | 06:50 AM

బంగారం(gold) కొనుగోలు చేసే వారికి శుభవార్త. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అక్షయ తృతీయ పండుగ (అక్షయ తృతీయ 2024) ముందు బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 200 కంటే ఎక్కువ తగ్గింది.

Gold and Silver Rates: అక్షయ తృతీయ ముందే మంచి ఉపశమనం..తగ్గిన గోల్డ్ ధరలు
gold and silver rate india May 6th 2024

బంగారం(gold) కొనుగోలు చేసే వారికి శుభవార్త. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అక్షయ తృతీయ పండుగ (అక్షయ తృతీయ 2024) ముందు బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 200 కంటే ఎక్కువ తగ్గింది. ఈ నేపథ్యంలో ఉదయం 6.30 సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,820 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,840గా ఉంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టడం బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.


వెండి ధరలు

ఇక వెండి(silver) ధరల విషయానికి వస్తే ఈరోజు ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.82,900గా చేరుకుంది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 200 రూపాయలకుపైగా తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.86,400కు చేరింది. ముంబైలో రూ.82,900, బెంగళూరులో రూ.82,500, చెన్నైలో కూడా రూ.86,400గా ఉంది.


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 71,820, ధర రూ. 65,840

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 71,720, ధర రూ. 65,740

  • చెన్నైలో బంగారం ధర రూ. 71,990, ధర రూ. 65,990

  • ముంబైలో బంగారం ధర రూ. 71,820, ధర రూ. 65,840

  • కోల్‌కతాలో బంగారం రూ. 71,820, ధర రూ. 65,840

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 06 , 2024 | 07:05 AM