చాంపియన్స్ ట్రోఫీకి ముందు  టీమిండియాకు గట్టి షాక్

మెగా ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్న రోహిత్ సేనకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 

యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఇంజ్యురీ అయింది. 

రంజీ ట్రోఫీ సెమీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లో జైస్వాల్‌ కాలి చీలమండకు గాయమైందని తెలుస్తోంది.  

గాయం కారణంగా యువ ఓపెనర్ ముంబై క్యాంప్ నుంచి తప్పుకున్నాడు వినిపిస్తోంది.

రికవరీ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లనున్నాడట జైస్వాల్. 

చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్‌లో ఒకడిగా ఉన్నాడు జైస్వాల్. 

జైస్వాల్ స్థానంలో నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ కోసం మరో ఆటగాడ్ని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.