సచిన్‌ను టార్గెట్ చేసిన రోహిత్.. ఏకంగా  ఆ రికార్డునే.. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో క్రేజీ రికార్డుపై కన్నేశాడు.

రోహిత్ శర్మ బ్యాట్ గర్జిస్తే ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేతో మరోసారి రుజువైంది

ఇంగ్లీష్ టీమ్‌ మీద చెలరేగి ఆడాడు.  ఫోర్లు, సిక్సులతో వాళ్లను ఊచకోత కోశాడు

ఇప్పుడు మరో క్రేజీ రికార్డుపై గురి పెడుతున్నాడు హిట్‌మ్యాన్. 

 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌తో పాటు దిగ్గజ సారథి సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేశాడు. 

సుదీర్ఘ కెరీర్‌లో 266 వన్డేలు ఆడిన రోహిత్.. 10,868 పరుగులు చేశాడు. 11 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు మరో 132 పరుగుల దూరంలో ఉన్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు జరిగే ఆఖరి వన్డేలోనూ భారీ సెంచరీ బాదితే అరుదైన క్లబ్‌లో చేరిపోతాడు

భారత్ తరఫున వన్డేల్లో 11 వేల క్లబ్‌లో చేరిన బ్యాటర్ల జాబితా చూసుకుంటే.. సచిన్‌తో పాటు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు

 వీళ్ల సరసన చేరేందుకు రోహిత్ ఉవ్విళ్లూరుతున్నాడు.

 ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌తో ఈ క్లబ్‌లో జాయిన్ అవుతాడా? లేదా చాంపియన్స్ ట్రోఫీలో ఆ ఘనతను అందుకుంటాడా? అనేది చూడాలి.