హిట్‌మ్యాన్ కా హుకుం..  అంతుపట్టని సమస్య అంతం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు

 తనదైన స్టైల్‌లో స్టన్నింగ్ నాక్‌తో నిజమైన హిట్‌మ్యాన్ అంటే ఏంటో చూపించాడు

చాన్నాళ్లుగా పరుగుల దాహంతో ఉన్న హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌ మీద ఉరుములా పడ్డాడు.

మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌ను అతడు ఊచకోత కోశాడు.

90 బంతుల్లో 119 పరుగులతో వార్ వన్ సైడ్ చేసేశాడు.

ఇందులో 12 బౌండరీలు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. 

వుడ్, రషీద్, అట్కిన్సన్, మహ్మూద్, ఓవర్టన్.. ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా బాదేశాడు.

 అతడి నాక్ వల్ల 304 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 33 బంతులు ఉండగానే భారత్ ఛేజ్ చేసేసింది

భారత జట్టు తరఫున ఓపెనర్‌గా దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సులు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ (259 ఇన్నింగ్స్‌ల్లో 332 సిక్సులు) నిలిచాడు.