ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా
ప్లేయింగ్ 11 ఇదే..
ఇంగ్లండ్‌తో వన్డే పోరాటానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.
టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది.
అనుభవం ఉన్న ఆటగాళ్లతో నిండిన టీమిండియా.. ఇంగ్లీష్ టీమ్‌ను తొక్కిపడేయాలని చూస్తోంది.
సీనియర్లతోనే మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగడం పక్కాగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దిగుతారు.
ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్‌లో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం.
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు.
వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్ రోల్ పోషిస్తాడు. పేస్ బౌలింగ్ బాధ్యతల్ని అర్ష్‌దీప్ సింగ్‌తో కలసి మహ్మద్ షమి చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి.
Related Web Stories
IPL 2025 ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు టిమ్ కి బిగ్ షాక్..
అభిషేక్‌కు భజ్జీ వార్నింగ్.. ఆ పని కూడా నేర్చుకోవాల్సిందే అంటూ..
అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్..
ఒక్క మ్యాచ్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ స్టన్నింగ్ ఫీట్