అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్..
ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ.
బౌండరీలు, సిక్సులతో హోరెత్తించాడు. ఉరుములు, మెరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేశాడు. బట్లర్ సేన మీద తుఫానులా విరుచుకు పడ్డాడు
7 బౌండరీలు, 13 సిక్సులతో ఆ టీమ్ బెండు తీశాడు.
బంతి వేయాలంటే భయపడేలా వణికించాడు. 54 బంతుల్లో 135 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆఖరి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు.
ఈ మ్యాచ్ తర్వాత అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..
వాంఖడే ఇన్నింగ్స్‌ను తన గురువు యువరాజ్ సింగ్‌కు అంకితం చేశాడు అభిషేక్. ఈ ఊచకోత నాక్ అతడి కోసమే అన్నాడు.
ఈ ఇన్నింగ్స్‌తో అతడు సంతోషిస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు. 15 నుంచి 16వ ఓవర్ దాకా తాను బ్యాటింగ్ చేయాలని, అప్పటివరకు క్రీజులో ఉండాలని యువీ చెబుతూ ఉండేవాడని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌పై సంతృప్తిగా ఉన్నానని అన్నాడు. సెంచరీ తర్వాత ఫ్యామిలీ కోసమే వాళ్ల వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నానని పేర్కొన్నాడు.