అభిషేక్‌కు భజ్జీ వార్నింగ్.. ఆ పని కూడా నేర్చుకోవాల్సిందే అంటూ..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. 

ఆఖరి టీ20లో 7 ఫోర్లు, 13 సిక్సులతో కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేశాడు. 

బౌలింగ్‌‌లోనూ రాణించిన యంగ్ ఓపెనర్.. 2 కీలక వికెట్లతో మెరిశాడు. 

అభిషేక్‌ ఇక మీదట బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ మీదా ఫోకస్ చేయాలని సూచించాడు హర్భజన్ సింగ్. 

అతడిలో మంచి లెగ్ స్పిన్నర్ దాగి ఉన్నాడని భజ్జీ చెప్పాడు. 

అభిషేక్ బ్యాటింగే చేస్తానంటే కుదరంటూ సీరియస్ అయ్యాడు హర్భజన్. 

బౌలర్‌గా ఎదగాలంటే అభిషేక్ మరింత సాధన చేయాలని సజెషన్ ఇచ్చాడు భజ్జీ.