IPL 2025 ఐపీఎల్‌కు ముందు
రాజస్థాన్‌కు టిమ్ కి బిగ్ షాక్..
ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలలోనే కొత్త సీజన్ షురూ కానుంది.
పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో ఆడటం అనుమానంగా మారింది
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంజూ.. ఆఖరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి చూపుడు వేలికి ఇంజ్యురీ అయింది.
ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి వచ్చి బలంగా తాకడంతో సంజూ చూపుడు వేలు విరిగిపోయినట్లు సమాచారం.
సుమారుగా 150 కిలోమీటర్ల భీకర వేగంతో వచ్చిన బంతి శాంసన్ కుడి చేతి గ్లవ్‌కు గట్టిగా తాకింది
ఆర్చర్ బౌలింగ్‌లో తాకిన దెబ్బకు ఫిజియో ట్రీట్‌మెంట్ అందించినా సంజూ కోలుకోలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నెలన్నర టైమ్ ఉంది. ఈలోపు అతడు రికవర్ అయితే ఓకే.
ఒకవేళ గాయం తీవ్రత మరింత పెరిగినా.. ఫిట్‌నెస్ సాధించడంలో ఆలస్యం అయినా, బ్యాటింగ్ రిథమ్ పోయినా రాజస్థాన్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.
Related Web Stories
అభిషేక్‌కు భజ్జీ వార్నింగ్.. ఆ పని కూడా నేర్చుకోవాల్సిందే అంటూ..
అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్..
ఒక్క మ్యాచ్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ స్టన్నింగ్ ఫీట్
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా