10 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ.. ఏకంగా 8 మంది స్టార్లు దూరం

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మెగా టోర్నీకి దూరమవడం ఖాయంగా మారింది. 

చాంపియన్స్ ట్రోఫీలో కమిన్స్‌ ఆడేది అనుమానమేనని కంగారూ కోచ్ మెక్‌డొనాల్డ్ అన్నాడు. 

వెన్ను నొప్పితో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా మెగా టోర్నీలో ఆడటం కష్టంగా మారింది. 

గాయాలపాలైన హేజల్‌వుడ్, మిచెల్ మార్ష్‌ కూడా ఈ టోర్నీకి దాదాపుగా దూరమైనట్లే. 

ఈ టోర్నీ టీమ్‌కు ఎంపికైన స్టొయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 మోకాలి గాయంతో బాధపడుతున్న కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కూడా మెగా టోర్నీలో ఆడటం కష్టమేనని తెలుస్తోంది.  

సౌతాఫ్రికా పేసర్ నోకియా, పాకిస్థాన్ ఓపెనర్ సయీమ్ అయూబ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు.