రోహిత్ తాండవం.. పాత రికార్డులకు పాతర

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 90 బంతుల్లో 119 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు హిట్‌మ్యాన్. 

ఈ మ్యాచ్‌తో 5 క్రేజీ రికార్డులు క్రియేట్ చేశాడు భారత సారథి.

 30 ఏళ్లు దాటాక అత్యధిక శతకాలు బాదిన భారత ఆటగాడిగా (36 సెంచరీలు) టాప్ ప్లేస్‌లో నిలిచాడు రోహిత్. 

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ బాదిన భారత బ్యాటర్‌గా (121 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) రోహిత్ మరో రికార్డు. 

15,404.. అత్యధిక పరుగులు చేసిన భారత్ ఓపెనర్‌గా ఇంకో రికార్డు. 

332.. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో బ్యాటర్‌గా అరుదైన ఘనత. 

30 ఏళ్లు దాటాక అత్యధిక సెంచరీలు చేసిన ఇంటర్నేషనల్‌ క్రికెటర్స్‌లో పాంటింగ్ (36 సెంచరీలు)తో కలసి మూడో స్థానంలో నిలిచాడు రోహిత్.