బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్.. ఇదీ జైస్వాల్ పవర్!

లీడ్స్ టెస్ట్‌లో ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్.. లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లండ్‌తో పోరులో 158 బంతుల్లో 101 పరుగులు చేశాడు జైస్వాల్. ఇందులో 16 బౌండరీలు, ఒక సిక్స్ ఉన్నాయి.

ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై యావరేజ్ విషయంలో బ్రాడ్‌మన్ రికార్డును చెరిపేశాడు జైస్వాల్.

ఇంగ్లండ్‌ మీద 10 ఇన్నింగ్స్‌ల్లో 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు భారత యువ ఓపెనర్.

ఇంగ్లీష్ టీమ్‌పై బ్రాడ్‌మన్ 63 ఇన్నింగ్స్‌ల్లో 89.78 సగటుతో 5028 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌పై 90 ప్లస్ యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల భారీ స్కోరు చేసింది.