మాక్స్‌వెల్ సంచలనం  రోహిత్ సరసన ఆసీస్ వీరుడు!

ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్ చాన్నాళ్ల తర్వాత తన బ్యాట్ పవర్ చూపించాడు.

మేజర్ లీగ్ క్రికెట్-2025లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు మాక్సీ.

వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున బరిలోకి దిగిన మాక్స్‌వెల్.. 49 బంతుల్లో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మాక్సీ ఇన్నింగ్స్‌లో 2 బౌండరీలు, 13 సిక్సులు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్‌లో అతడికి ఇది ఎనిమిదో సెంచరీ.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్లలో రోహిత్ శర్మ సరసన చేరాడు మాక్స్‌వెల్.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన వారి జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అతడి సరసన చేరాడు కంగారూ హిట్టర్.

మాక్సీ వీరవిహారంతో లాస్ ఏంజెలెస్‌తో మ్యాచ్‌లో 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు.