టీ20ల్లో అసాధారణ రికార్డు నెలకొంది. మూడు సూపర్ ఓవర్లతో రిజల్ట్ తేలింది.
నేపాల్-నెదర్లాండ్స్ మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది.
ఇరు జట్ల పోరులో స్కోర్లు సమం అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అక్కడా పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఎట్టకేలకు మూడో సూర్ ఓవర్‌లో ఫలితం తేలింది.
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో మూడుసార్లు సూపర్ ఓవర్ జరగడం ఇదే మొదటిసారి.
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్‌కు దిగి 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన నేపాల్ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 152 పరుగులు చేసింది.
తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 19 పరుగులు చేయడంతో రెండోసారి ట్రైబ్రేకర్ పెట్టారు. అందులోనూ రెండు టీమ్స్ చెరో 17 రన్స్ చేశాయి.
మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్ ఒక్క పరుగూ చేయలేదు. దీంతో టార్గెట్ ఒక్క పరుగును డచ్ ఛేదించింది.