చోకర్స్ కాదు.. చాంపియన్స్  దమ్ముంటే ఎగతాళి చేయండి!

డబ్ల్యూటీసీ ఫైనల్ అనగానే గద కైవసం చేసుకునేది ఆస్ట్రేలియానే అని చాలా మంది భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కంగారూలను చిత్తు చేసింది సౌతాఫ్రికా. 5 వికెట్ల తేడాతో నెగ్గి చాంపియన్‌గా నిలిచింది ప్రొటీస్.

చోకర్స్.. చోకర్స్ అంటూ ఇన్నాళ్లూ అవమానాలు ఎదుర్కొన్న జట్టు.. విజేతగా ఆవిర్భవించడం చూసి అంతా అవాక్కయ్యారు.

ఐసీసీ కప్పు గెలిచారంటే ఆ దేశ అభిమానులు మాత్రమే సంబురాలు చేసుకుంటారు. కానీ సౌతాఫ్రికా నెగ్గేసరికి క్రికెట్ లవర్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

1999లో ఐసీసీ నాకౌట్ టోర్నీ (చాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తర్వాత నుంచి ఇన్నేళ్లలో ఒక్కసారీ ప్రపంచ టోర్నీలో విజయం సాధించలేదు సఫారీలు.

ఎట్టకేలకు ఆసీస్‌ను ఓడించి డబ్ల్యూటీసీ గదను సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు.

ఆస్ట్రేలియా నోటి నుంచి మ్యాచ్‌ను లాగేసుకొని రియల్ చాంపియన్‌లా గెలిచింది సౌతాఫ్రికా. ఇకపై ఆ జట్టును ఒక్క మాట అనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పదు.