ఇండో-పాక్ క్రికెట్ వార్.. డేట్ ఫిక్స్!

భారత్-పాకిస్థాన్ మధ్య అన్ని సంబంధాలు తెగిపోయాయి. క్రికెట్ విషయంలోనూ ఇరు దేశాల నడుమ ఇదే పరిస్థితి.

పాక్‌తో క్రికెట్ రిలేషన్స్‌ను కంప్లీట్‌గా తెంచేసే దిశగా బీసీసీఐ ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది.

ఇండో-పాక్ వరల్డ్ కప్ వార్‌ మీద ఒక అప్‌డేట్ వచ్చింది. రెండు టీమ్స్ త్వరలో బరిలోకి దిగి తలపడనున్నాయి.

ఐసీసీ విమెన్స్ వన్డే ప్రపంచ కప్-2025లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 5న జరిగే ఈ ఫైట్‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది.

పాక్ ఆడే అన్ని మ్యాచులు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.

విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ తప్ప అన్ని మ్యాచులు ఇక్కడే జరగనున్నాయి.