కోహ్లీ-ఏబీడీ మాటలు బంద్..  ఇదేం ట్విస్ట్ భయ్యా!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే.

ఆర్సీబీ తరఫున ఏళ్ల పాటు ఆడుతూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు విరాట్-ఏబీడీ.

ఇంతమంచి స్నేహితులు 6 నెలల పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా డివిలియర్స్ బయటపెట్టాడు.

కోహ్లీతో తనది ఒకే బోటు ప్రయాణమన్నాడు ఏబీడీ. అయితే గత 6 నెలలుగానే అతడితో టచ్‌లో ఉన్నానని తెలిపాడు.

కోహ్లీతో మాట్లాడటం ఊరటనిచ్చిందన్నాడు ఏబీడీ. ఫామ్ సమస్యలు ఉండటంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విరాట్ తనను సంప్రదించాడని ఏబీడీ పేర్కొన్నాడు.

కోహ్లీ ఆటతీరును పరిశీలించాక తనకు అనిపించింది చెప్పానని.. అతడికి తన నుంచి 100 శాతం మద్దతు ఉంటుందన్నాడు.

అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేయడం వల్లే డివిలియర్స్‌తో కోహ్లీ మాటలు కట్ చేశాడని నెట్టింట వినిపిస్తోంది.