సచిన్ కాదు.. కోహ్లీతోనే కష్టం
ఇలా అనేశాడేంటి?
భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరు గ్రేట్ అనే టాపిక్ వస్తే ఫలానా క్రికెటర్ తోపు అని చెప్పలేం.
టీమిండియాకు ఏళ్ల పాటు ఎనలేని సేవలు అందించారు కోహ్లీ-సచిన్. ఇద్దరూ తాము ఆడిన సమయాల్లో అందరు బౌలర్లను డామినేట్ చేశారు.
ఇద్దరిలో ఎవరు గ్రేట్ అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ మాత్రం సచిన్ కంటే కోహ్లీతోనే కష్టమని అంటున్నాడు.
2014లో కోహ్లీని ఇబ్బంది పెట్టానని.. ఆఫ్ స్టంప్ ఆవల పడే డెలివరీస్‌తో అతడ్ని ఔట్ చేశానన్నాడు అండర్సన్.
2018 టూర్‌లో ఆఫ్ స్టంప్ బలహీనతను కోహ్లీ అధిగమించాడని తెలిపాడు.
కోహ్లీతో పోలిస్తే సచిన్ వైవిధ్యమైన బ్యాటర్ అని.. ప్రశాంతంగా ఉంటాడని అండర్సన్ పేర్కొన్నాడు.
కోహ్లీ ఎమోషన్స్‌ను బయటకు చూపిస్తాడని, అతడితో పోటీపడటం తనకు ఇష్టమని వ్యాఖ్యానించాడు.
Related Web Stories
టీ20 చరిత్రలోనే సంచలనం.. 3 సూపర్ ఓవర్లతో..!
ఇండో-పాక్ క్రికెట్ వార్.. డేట్ ఫిక్స్!
కోహ్లీ-ఏబీడీ మాటలు బంద్.. ఇదేం ట్విస్ట్ భయ్యా!
17 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. జాన్ సీనానే భయపెడుతున్నాడు!