ఇండో-ఇంగ్లండ్ సిరీస్  స్ట్రీమింగ్ అందులోనే!

భారత్-ఇంగ్లండ్ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రోహిత్, కోహ్లీ, అశ్విన్ గైర్హాజరీలో కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు.

జూన్ 20 (శుక్రవారం) నుంచి ఈ అండర్సన్-టెండూల్కర్ సిరీస్ షురూ కానుంది.

5 టెస్టుల ఈ సిరీస్‌ మ్యాచులన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానల్స్‌లో టెలికాస్ట్ అవుతాయి.

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే జియో హాట్‌స్టార్ యాప్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

జులై 2 నుంచి 6 వరకు రెండో టెస్ట్, అదే నెల 10 నుంచి 14 వరకు మూడో టెస్ట్ జరుగుతాయి.

జులై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్, అదే నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా చివరి టెస్ట్ జరుగుతాయి.