కోహ్లీకి మైండ్ దొబ్బింది..  ఇంత మాట అనేశాడేంటి బ్రో!

టెస్టులకు అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఫైర్ అయ్యాడు.

ఎంత గొప్ప ప్లేయర్‌కైనా ఒకదశలో మెదడు స్తబ్దుగా మారిపోతుందని.. విరాట్ విషయంలో బహుశా అదే జరిగి ఉండొచ్చునన్నాడు.

కోహ్లీలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉందన్నాడు తివారీ.

10 వేల పరుగులకు చేరువలో రిటైర్ అవడం సరికాదన్నాడు.

వీలైనంత త్వరగా విరాట్ రిటైర్‌మెంట్‌పై వెనక్కి తగ్గాలని మనోజ్ తివారీ కోరాడు.

కళ్లు మూసుకొని తన నిర్ణయాన్ని అతడు వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు.

కోహ్లీ రిటైర్‌మెంట్‌పై వెనక్కి జరిగితే ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటారన్నాడు.