బుమ్రాను వదిలేయండి.. రవిశాస్త్రి రిక్వెస్ట్

 రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో భారత టెస్ట్ జట్టు కొత్త సారథిగా ఎవర్ని నియమిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 కెప్టెన్సీ రేసులో గిల్, జైస్వాల్, పంత్‌తో పాటు సీనియర్ పేసర్ బుమ్రా పేరు బాగా వినిపిస్తోంది.

  బుమ్రాను వదిలేయండి, అతడిపై భారం వద్దని అంటున్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.

  బుమ్రాను కెప్టెన్ చేస్తే బౌలర్‌గా అతడ్ని కోల్పోతామని అన్నాడు.

 ఒక్కో మ్యాచ్ చూసుకొని ఆడాల్సిన స్థితిలో పేసుగుర్రం ఉన్నాడని తెలిపాడు.

  కెప్టెన్సీ ప్రెజర్ బుమ్రాపై పడటం కరెక్ట్ కాదన్నాడు రవిశాస్త్రి.

  సారథ్యానికి గిల్ బెస్ట్ ఆప్షన్ అని సూచించాడు. పంత్ రూపంలో ఇంకో ఆప్షన్ కూడా ఉందన్నాడు.