గచ్చిబౌలి స్టేడియంలో అందాల భామల ఆటలు..
హైదరాబాద్ నగర ఖ్యాతి గ్లోబల్ స్థాయిలో మార్మోగేలా 72వ మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రోజుకో ప్రసిద్ధ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవాళ పోటీల్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో అందాల పోటీలలో పాల్గొన్నారు.
మొత్తం 10 ఈవెంట్ లలో పోటీలు నిర్వహించారు. 109 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారు.
రోలర్ స్కేటింగ్, యోగ నమస్కారం, బాడ్మింటన్, షాట్ పుట్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, షటిల్, ఫిట్ నెస్ రన్ పోటీలలో పాల్గొన్నారు
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో అమెరికన్, కరీబియన్ ,ఆఫ్రికా, యూరప్,ఆసియా, ఓషియానియా టీంలుగా విడిపోయి పార్టిసిపేట్ చేశారు
మే 10న ప్రారంభమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 31 న ముగియనున్నాయి.
Related Web Stories
10వ తరగతి లో విరాట్‌కు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
ఆర్సీబీకి తిరిగి రావొద్దనుకున్నా.. పాటిదార్ ఇలా అనేశాడేంటి..
బీసీసీఐ కొత్త రూల్స్.. వాళ్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
పేస్ పిచ్చోడు వస్తున్నాడు.. ఆర్సీబీని ఇక ఆపలేం..