కోహ్లీ రిటైర్మెంట్ వెనుక భారీ కుట్ర  ఇది పక్కా వాళ్ల ప్లానే!

దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది

దీనంతటికీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కారణమని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి.

గౌతీ వల్లే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

విరాట్ అంటే గౌతీకి అసూయ అని అందుకే అతడ్ని బయటకు పంపేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడినందుకు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని రిటైర్ అయ్యేలా చేశారని.. ఇది దారుణమని సీరియస్ అవుతున్నారు.

గంభీర్ హయాంలో వరుసగా 2 సిరీస్‌లు కోల్పోయాం, డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకోలేకపోయాం, ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లు జట్టును వీడారు.. ఇదీ అతడి ఘనత అంటూ దుయ్యబడుతున్నారు