మోదీ పర్మిషన్ ఇస్తారా..  తలపట్టుకుంటున్న బీసీసీఐ

ఇండో-పాక్ ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది క్యాష్ రిచ్ లీగ్. 

రెండు దేశాలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించడంతో ఐపీఎల్‌ను తిరిగి స్టార్ట్ చేయాలని చూస్తోంది బీసీసీఐ. 

సీజన్ రీస్టార్ట్‌పై ఐపీఎల్ పాలకసభ్యులతో బీసీసీఐ చర్చలు జరిపింది. 

 మిగిలిన మ్యాచుల షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తోంది బోర్డు.

మోదీ సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గానీ ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యే చాన్సుల్లేవ్. 

కాల్పుల విరమణకు సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. 

ప్లేయర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తీసుకునే నిర్ణయం మీదే ఐపీఎల్ రీస్టార్ట్ అవడం ఆధారపడి ఉంది.