కోహ్లీ ఒప్పుకోవాల్సిందే..  ఫ్యాన్స్ రిక్వెస్ట్..

 టెస్టులకు గుడ్‌బై చెప్పేసి.. వన్డేల్లో మాత్రమే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడట విరాట్. 

లాంగ్ ఫార్మాట్‌లో ఇంకొన్నాళ్లు కొనసాగాలని బీసీసీఐ నచ్చజెబుతున్నా కోహ్లీ వినడం లేదని పుకార్లు వస్తున్నాయి.

రోహిత్‌లాగే తానూ టెస్టుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట కింగ్. 

భారత్‌కే కాదు.. టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ అవసరం  ఉందని బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలు అంటున్నారు. 

అభిమానులు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు మానుకోవాలంటూ కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

ఫామ్, ఫిట్‌నెస్, వర్క్‌లోడ్.. ఇలా ఏ విధంగానూ సమస్య లేదు కాబట్టి మరికొన్నేళ్లు భారత జట్టును ముందుండి నడిపించాలని కోరుతున్నారు ఫ్యాన్స్. 

బీసీసీఐ, మాజీ క్రికెటర్ల కోసం కాకపోయినా అభిమానుల కోసం కోహ్లీ రిటైర్మెంట్ ఆలోచనలు ఆపేయాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.