ఆ రోజు క్రికెట్ వదిలేస్తా..  బాంబు పేల్చిన రోహిత్ 

ఇటీవలే టెస్టుల నుంచి తప్పుకున్నాడు హిట్‌మ్యాన్. 

 ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి అతడు వైదొలిగాడు. 

ఇక మీదట వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు హిట్‌మ్యాన్. 

వన్డేల్లో విఫలమైతే అందులో నుంచీ తప్పుకుంటాడా అనే వ్యాఖ్యలపై రోహిత్ స్పందించాడు. 

బరిలోకి దిగి తాను చేయాలనుకున్నది చేయలేని నాడు ఆట నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాడు.

క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్‌మెంట్ తీసుకోవాలనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందన్నాడు. 

ఇప్పుడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు హిట్‌మ్యాన్.