కోహ్లీకి అందే పెన్షన్ ఎంతో తెలుసా..

14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు విరాట్. 

ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న కింగ్.. ఇకపై వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 

టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో కోహ్లీకి అందే పెన్షన్‌ ఎంతంటూ జోరుగా చర్చించుకుంటున్నారు నెటిజన్స్. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడితే రూ.70 వేల పెన్షన్ ఇస్తారు. 

కోహ్లీ ఈ పెన్షన్‌కు అర్హుడే.. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. 

టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నా.. వన్డేల్లో కొనసాగుతున్నందున విరాట్‌కు పెన్షన్ రాదు. 

వన్డేల్లో నుంచీ తప్పుకుంటే అప్పుడు ఫార్మాట్‌కు చొప్పున ఆడిన మ్యాచులను బట్టి కోహ్లీకి బోర్డు పెన్షన్ అందిస్తుంది.