కోహ్లీ అప్పుడే చెప్పేశాడు..  బీసీసీఐ రియాక్షన్ వైరల్!

టెస్టులకు విరాట్ రిటైర్‌మెంట్ ఇవ్వడంపై అనలిస్టుల నుంచి మాజీ క్రికెటర్ల వరకు అంతా స్పందిస్తున్నారు.

కోహ్లీ లేని లోటును పూడ్చలేమని అంటున్నారు.

విరాట్ లేని టీమిండియాను ఊహించలేమని చెబుతున్నారు.

కోహ్లీ రిటైర్‌మెంట్‌పై భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.

టెస్టుల నుంచి తప్పుకుంటానని ఏప్రిల్ నెలలో కోహ్లీ తమకు సమాచారం ఇచ్చాడని అగార్కర్ తెలిపాడు.

రిటైర్ అవ్వాలని తాను నిర్ణయించుకున్నానని విరాట్ తమకు చెప్పాడని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ టూర్‌కు వెళ్తున్న భారత జట్టులో కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ.