ధోని రిటైర్‌ అయిపో..  సీనియర్ల మాటలు వింటే షాక్!

వచ్చే ఐపీఎల్‌లో ధోని ఆడతాడా.. లేదా.. అనే చర్చలు నడుస్తున్నాయి.

ఫ్యాన్స్ ఒకలా చర్చిస్తుంటే.. మరోవైపు సీనియర్ క్రికెటర్లు ధోని రిటైర్‌మెంట్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

మాహీ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని జోగిందర్ శర్మ అన్నాడు.

ధోని స్థానంలో తాను ఉంటే ఈపాటికే ఆట నుంచి తప్పుకునేవాడ్ని అని సంజయ్ బంగర్ చెప్పాడు.

రిటైర్‌మెంట్‌ మీద ధోని ఏదో ఒకటి తేల్చుకునే సమయం వచ్చిందన్నాడు కృష్ణమాచారి శ్రీకాంత్.

వచ్చే సీజన్‌లో ఆడటం గురించి మాహీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆడాలా.. వద్దా.. అనేది తన శరీరమే తనకు చెబుతుందన్నాడు.

ఒత్తిడిని తట్టుకోగలను అనుకుంటే కొనసాగుతానని స్పష్టం చేశాడు.