రాత మార్చే సారథి.. పట్టుకుంటే బంగారమే!

కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ రాత మార్చేశాడు.

సారథిగా వచ్చిన తొలి సీజన్‌లోనే పంజాబ్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు అయ్యర్.

11  ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు చేరుకుంది పంజాబ్. దీనికి కోచ్  పాంటింగ్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఐపీఎల్‌లో కెప్టెన్‌ రోల్‌లో రెచ్చిపోతున్నాడు అయ్యర్.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తూ 2020లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు అయ్యర్.

గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు.

ఈసారి పంజాబ్‌‌ను విజేతగా నిలబెట్టాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు.

పంజాబ్ గనుక కప్ కొడితే టీ20ల్లో భారత జట్టు సారథ్యానికి గట్టి పోటీ ఏర్పడుతుంది. గిల్ వర్సెస్ అయ్యర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.