రాక్షసుల రాక.. ఇక ముంబైని ఆపలేరు!

ప్లేఆఫ్స్ కోసం రాక్షసులను దించుతోంది ముంబై ఇండియన్స్.

విల్ జాక్స్, ర్యాన్ రికల్టన్, కార్బిన్ బాష్ లీగ్ మ్యాచుల తర్వాత టీమ్‌ను వీడనున్నారు.

వీళ్ల స్థానాల్లో జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకను దింపుతోంది ఎంఐ.

ప్లేఆఫ్స్ మ్యాచుల నుంచి ఈ ముగ్గురు స్టార్లు అందుబాటులో ఉంటారు.

పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయే బెయిర్‌స్టో.. రోహిత్ శర్మతో కలసి ఓపెనింగ్ చేయనున్నాడు. 

టీ20ల్లో ఎంతో అనుభవం కలిగిన రిచర్డ్ గ్లీసన్ రాణిస్తే ఎంఐ బౌలింగ్ యూనిట్ మరింత బలపడుతుంది.

స్ట్రైక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించే అసలంక.. అవసరాన్ని బట్టి గేర్లు మారుస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటాడు.