కోర్టుకెక్కిన ప్రీతి జింటా..  అది చెల్లదంటూ..!

పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా కోర్టుకెక్కింది.

పంజాబ్ కో-ఓనర్స్ నెస్ వాడియా, మోహిత్ బుర్మాన్‌పై చండీగఢ్ కోర్టులో కేసు వేసిందామె.

రూల్స్‌కు విరుద్ధంగా నెస్ వాడియా, బుర్మాన్ బోర్డు మీటింగ్ నిర్వహించారని పిటిషన్‌లో పేర్కొంది.

చట్టబద్ధంగా ఈ భేటీ చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరింది.

డైరెక్టర్‌గా మునీశ్ ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది ప్రీతి.

ఈ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలవ్వకుండా చూడాలని కోర్టును అభ్యర్థించింది.

ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు తాను, కరుణ్‌పాల్ లేకుండా బోర్డు సమావేశాలు జరగకుండా చూడాలని కోరింది ప్రీతి జింటా.