కోహ్లీకి కరెక్ట్ రీప్లేస్‌మెంట్ అతడే: గంగూలీ

విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెగ్యులర్‌‌‌గా ఆడే నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్‌కు వస్తున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్‌ టెస్ట్‌లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్.. 147 పరుగులతో దుమ్మురేపాడు.

విరాట్ లేని లోటు కనిపించకుండా చేశాడు గిల్. ఈ నేపథ్యంలో అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు దిగ్గజం సౌరవ్ గంగూలీ.

కోహ్లీ లాంటి క్లాస్ ప్లేయర్‌ను రీప్లేస్ చేయడం చాలా కష్టమన్న దాదా.. అతడు లేని లోటు పూడ్చడం అంత ఈజీ కాదన్నాడు.

లీడ్స్ టెస్ట్‌‌లో గిల్ అద్భుతంగా ఆడాడని.. అతడి పాదాల కదలిక సంతోషాన్ని కలిగించిందన్నాడు గంగూలీ.

గిల్ ఇలాగే ఆడితే కోహ్లీని రీప్లేస్‌ చేయగలడని.. అతడిలా టన్నుల కొద్దీ పరుగులు చేయడగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గిల్ ఇదే ఫుట్‌వర్క్‌ను కొనసాగిస్తే అతడి యావరేజ్ 40 నుంచి 45 వరకు పెరుగుతుందన్నాడు దాదా.